685 గ్రాముల బంగారం పట్టివేత

నవతెలంగాణ-శంషాబాద్‌
పెద్ద పేగు పురీష నాళంలో రహస్యంగా బంగారం దాచి తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికా రులు పట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబా ద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో గురువారం తెల్లవారుజా మున జరిగింది. హైదరాబాద్‌ కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మస్కట్‌ నుంచి ప్రయాణికుడు తెల్లవారుజామున శంషా బాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు డబ్లు వై – 231విమానంలో వచ్చాడు. అనుమానంతో కస్టమ్స్‌ ఎయిర్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు అతనిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రహస్య భాగం పెద్ద పేగు పురీష నాళంలో 685 గ్రాముల గోల్డ్‌ పేస్ట్‌ రహస్యంగా దాచుకుని వచ్చాడు. తనిఖీలు నిర్వహించి బంగారాన్ని గుర్తించా రు. వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకొని బంగారాన్ని బయటకు తీసి తూకం వేశారు. 685 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. విలువ రూ.42,78,768 ఉంటుందని అంచనా వేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love