– మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై సస్పెన్స్
– ప్రకటించకుండా రాజకీయం
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారును పడేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ..ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. శివరాజ్ సీఎంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఆయనను సీఎం క్యాడెంట్గా ప్రకటించలేదు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మాజీ సీఎం కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విషయంలో బీజేపీ ఇంకా అయోమయంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ తో మరో నేత టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అతనే నర్సింగ్‌పూర్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. శివరాజ్‌ను ముఖ్యమంత్రిగా కాషాయ పార్టీ ఇంకా ప్రకటించకపోవడానికి ఇదే కారణం.
జబల్పూర్లో పటేల్.. ‘బీజేపీ వర్కింగ్ స్టైల్లో సీఎం ముఖమని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఎప్పుడు ముఖ్యమంత్రిని మార్చేస్తారో తెలియదన్న నానుడి. ఇదంతా సహజం. ఊహాగానాలు చేయవద్దు. డిసెంబర్ కోసం వేచి ఉండండి.” అని పటేల్ అంటున్నారు.
”ఇవి నా మొదటి అసెంబ్లీ ఎన్నికలు.” తదుపరి ముఖ్యమంత్రిగా పార్టీ ఓబీసీని ఎన్నుకుంటుందా అని అడిగినప్పుడు? దీనిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ..”నా కులం వెనుకబడింది కానీ వెనుకబడలేదు.. దాన్ని సద్వినియోగం చేసుకుంటా” అని పటేల్ అన్నారు.
బీజేపీలో పోరు ఉందని కమల్‌నాథ్ గతంలో చెప్పారని, అయితే వాస్తవం భిన్నంగా ఉందని పటేల్ చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో దాదాపు 20 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉందని, అయితే అభివద్ధి ముందు అధికార వ్యతిరేకత లేదని పటేల్ అన్నారు. ”మా పథకాలు పేదల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయి… మా పథకాలను ఎవరూ విమర్శించలేరు. మహిళా సాధికారతలో మేము అగ్రగామిగా ఉన్నాం. భవిష్యత్తు కోసం మాకు విజన్ ఉంది. మేము దానిని అందుబాటు లోకి తెచ్చాము. ”మాకు ఎల్పీజీ ధరలను తగ్గించింది. ఇవి ఉచిత విషయాలు కాదు. ఇది ప్రజలను ఆకర్షించడం కాదు.
అయితే బీజేపీ చేస్తున్న మత రాజకీయాలకు విసిగి, వేసారిన మధ్య ప్రదేశ్ ఓటర్లు తమ నిర్ణయాత్మక ఓటును ఎవరికి వేస్తారో వేచి చూడాలి.