– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శ
న్యూఢిల్లీ : ఎన్నికల్లో విజయం సాధించలేమని భావించిన చోట్ల బీజేపీ అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను, ప్రమాణాలను గాలికి వదిలేసి, రెయిడ్- డిఫెక్ట్ – రీసెట్ (కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు – అటుపై పాలక పార్టీలోకి ఫిరాయింపులు – చివరగా కేసుల మూసివేత, లేదా సంబంధిత పార్టీకి క్లీన్‌చిట్ ఇవ్వడంతో ముగియడం) సూత్రాన్ని పాటిస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి ప్రయాణమనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వల్లనే సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. సైద్ధాంతిక నిబద్ధత లేకపోతే రాజకీయాలనేవి ఒక కట్టుబాటు లేకుండా చాలా పెళుసుగా తయారవుతాయని, అధికారాన్ని అమ్మకపు సరుకుగా మార్చివేస్తారని, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశమని బేబీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
ప్రజాస్వామ్య సూత్రాలకు బీజేపీ పాతర
- Advertisement -
- Advertisement -



