Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహనీయుల ఉత్సవసభ కరపత్రం విడుదల

మహనీయుల ఉత్సవసభ కరపత్రం విడుదల

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి
ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించనున్న మహనీయుల ఉత్సవ సభ కర పత్రాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూంపల్లి, అక్బర్ పేట మండల కేంద్రంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం మంచి పరిణామామన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే సామాజిక విప్లవానికి నాంది పలికారని, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసి పేదలకు హక్కులను కల్పించి సామాజిక హోదాను కల్పించారని, బాబు జగ్జీవన్ రామ్ దేశంలోనే మొట్టమొదటి దళిత ఉప ప్రధానిగా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు.

సమాజంలో అంతరాలు ఉండొద్దని మహనీయులు కలలు కన్నారని వారి కళలు సాకారం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్ లో చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అస యాదగిరి, మాజీ సర్పంచ్ లు తౌడ శ్రీనివాస్, బండమీద మల్లన్న, ప్రముఖ కవి, గాయకుడు నర్సింలు, ఇనుప సురేష్ , కన్జుమర్ ఫోరం అధ్యక్షుడు కుంబాల రవి, టెలికం బోర్డు సభ్యులు వనం కనకయ్య, నాయకులు కమ్మరి శ్రీనివాస్, ఇనుప శ్రీకాంత్, రమేష్, బండ రామ స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -