నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి గ్రామస్థాయి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో భారత రాష్ట్ర సమితి జెండాను గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎగరవేశారని తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గ్రామస్థాయి నాయకులు ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో భాగంగా వారికి ప్రత్యేకంగా బహుమతులు అందించామని అన్నారు. ఈ కేసీఆర్ ఆధ్వర్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ హన్ముకొండ, గ్రామస్తులు ఉమేష్ పాటీల్ , తానాజి , రామచంద్ర పటేల్ , యువకులు రామచందర్, యువకులు రా హన్మంత్ , పవన్, తదితరులు పాల్గొన్నారు.
డోన్గావ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



