నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని పిరట్వానిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని గ్రామ సర్పంచ్ సుప్రియ పరిశీలించారు. దాసరోనికుంట వద్ద కొనసాగుతున్న పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీరు తాగడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, తలపై గుడ్డలు కట్టుకోవడం వంటి జాగ్రత్తలను పాటించాలని సూచించారు. పనుల సమయంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే అధికారులకు తెలియజేయాలని తెలిపారు. కూలీల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ భీమయ్య, టెక్నికల్ అసిస్టెంట్ మల్లేష్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్కీరామ్, ఆశ వర్కర్ తాడూర్ విజయ, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



