నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ చంద్ర బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్ ఆధ్వర్యంలో తమ గ్రామ పోలీస్ గా వ్యవహరించిన కానిస్టేబుల్ నవీన్ చంద్ర బదిలీ పై వెళ్తుండడంతో ఈ మేరకు సోమవారం కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో వీడ్కోలు సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన్ చంద్రను ఎస్ఐ అనిల్ రెడ్డి సమక్షంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజ్జారపు రాకేష్ గ్రామ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర అందించిన సేవలు మరువలేనివన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారంలో చూపించిన చొరవ ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సతీష్, వెంకట్ గౌడ్, జీపు రాము, సంజీవ్, సుమన్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
బదిలీపై వెళ్తున్న గ్రామ కానిస్టేబుల్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -



