చేతులు కలిపిన మాజీ ప్రధానులు
ఇజ్రాయిల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు
టెల్ అవీవ్ : ఈ ఏడాది చివరలో ఇజ్రాయిల్‌లో జరగబోయే ఎన్నికలలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఓడించేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు. మాజీ ప్రధానులు నెఫ్తానీ బెన్నెట్, ఎయిర్ లపిడ్ ఆదివారం ప్రకటనలు విడుదల చేస్తూ తమ పార్టీల (బెన్నెట్ 2026, దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్) విలీనాన్ని ప్రకటించారు. తలో దారి పట్టిన ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ఉద్దేశంతో వీరు కూటమిగా ఏర్పడ్డారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీకి ‘టుగెదర్’ అని నామకరణం చేస్తారని, దానికి బెన్నెట్ నాయకత్వం వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. దేశం కోసం జియోనిస్ట్ (పాలస్తీనా ప్రాంతంలో యూదుల కోసం స్వతంత్ర దేశాన్ని స్థాపించాలనే ఉద్యమానికి మద్దతు ఇవ్వడం), దేశభక్తి పూరిత చర్య తీసుకుంటు న్నానని లిపిడ్‌తో జరిపిన సంయుక్త పత్రికా సమావేశంలో బెన్నెట్ చెప్పారు. కాగా బెన్నెట్ గౌరవనీయ వ్యక్తి అని, తమ మధ్య పరస్పర విశ్వాసం ఉన్నదని ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో లిపిడ్ తెలిపారు. ‘ప్రతిపక్షాలను ఏకం చేయడం, అంతర్గత విభేదాలకు స్వస్తి చెప్పడం, రాబోయే కీలక ఎన్నికలలో విజయం సాధించడం మా ముందు ఉన్న లక్ష్యాలు. వాటి సాధన కోసమే మేము ఏకమయ్యాం. ఇజ్రాయిల్‌ను భవిష్యత్తు దిశగా నడుపుతాం’ అని అన్నారు. తాము విజయం సాధిస్తే 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేయడానికి దారితీసిన వైఫల్యాలపై విచారణ జరుపుతామని, అందుకోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని బెన్నెట్ చెప్పారు.
నెతన్యాహూను ఓడిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



