Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి

కార్మికుల కోసం కడదాకా నిలిచిన వ్యక్తి పెద్దబ్బాయి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మధిరలో ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభ
నవతెలంగాణ-మధిర

కార్మికులు, కర్షకుల హక్కుల కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని కడదాకా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆది వెంకటేశ్వర్లు (పెద్దబ్బాయి) అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరస్తు ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం పార్టీ పట్టణ కార్యదర్శి పడకంటి మురళి అధ్యక్షతన ఆది వెంకటేశ్వర్లు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పెద్దబ్బాయి కార్మికుల కోసం, ఎర్రజెండా కోసం తన తుది శ్వాస వరకు పోరాడారని గుర్తు చేశారు. 50 సంవత్సరాలుగా మధిర పట్టణంలో బిల్డింగ్‌రంగ కార్మికులను ఐక్యపరచడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. పెద్ద మనసున్న నాయకుడిగా కార్మికులకు పెద్దన్నలా నిలిచారని అన్నారు. అవకాశవాద, కార్పొరేట్‌ రాజకీయాలు పెరిగిన సమయంలో కూడా తాను నమ్మిన ఎర్రజెండా కిందే నిలబడి పోరాటం కొనసాగించడం సాధారణ విషయం కాదన్నారు.మార్క్సిస్టు సిద్ధాంతం చిరస్థాయిగా నిలిచేదని, ఆ సిద్ధాంతాన్ని చివరి వరకు నమ్మిన వ్యక్తి పెద్దబ్బాయి అని అన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా మాజీ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్‌ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, సీనియర్‌ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, శీలం నరసింహారావు, దివ్వెల వీరయ్య, మందా సైదులు, మద్దాల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -