డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు
మిర్యాలగూడను ప్రధాన పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రైపోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యా యని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో రూ.500 కోట్లతో ట్రైన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ నవంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి నిధుల కోసమేనని చెప్పారు. నేషనల్ హైవేపై నిర్మించాల్సిన ఫ్లైఓవర్ పనుల గురించి ఇప్పటికే కాంట్రాక్టర్లతో చర్చలు జరిపామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. హైవేపై ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారికంగా లేఖ రాశామని, జాతీయ రహదారులపై ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్ పనిలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా బలంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా 12 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. మిర్యాలగూడను రానున్న రోజుల్లో ప్రధాన పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ధుతామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస నేత ఉన్నారు.
హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు,
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



