Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపర్యాటక 'ప్రభ' పెంచుదాం

పర్యాటక ‘ప్రభ’ పెంచుదాం

- Advertisement -

తెలంగాణను మేటిగా తీర్చిదిద్దుదాం ొ హైదరాబాద్‌లో భారీగా కార్నివాల్‌ నిర్వహణ
నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ : మంత్రి జూపల్లి దిశానిర్దేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేం దుకు అత్యంత అనువైన ప్రాంతమని పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్‌, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మంగళవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ/ మండలి సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, అద్భుతమైన కట్టడాలు, ప్రకతి రమణీయ ప్రదేశాలు, జల వనరులు, దట్టమైన అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను ఒక శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు కనీస సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడ దని మంత్రి అధికారులకు సూచించారు.

ముఖ్యంగా మరుగుదొడ్లు, తాత్కాలిక వసతి గదులు, టెంట్లు, గ్లాస్‌ హౌస్‌లతో పాటు రహదారి పక్కన ఉండే విశ్రాంతి సౌకర్యాలను వెంటనే మెరుగుపర్చాలని కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. సలహా కమిటీ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అమలు ప్రక్రియలో జాప్యం జరగకుండా ఒక నిర్దిష్ట పని లేదా ప్రాజెక్ట్‌ బాధ్యతను పర్యవేక్షించడానికి నోడల్‌ అధికారికి అప్పగించాలని సూచించారు. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేం దుకు నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్‌ నిర్వహణకు అధ్యయనం చేయాలని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పత్రిపాదనలు రూపొందించి, సమర్పించాలని ఆదేశించారు. ప్రారంభంలో ప్రభుత్వమే దీనిని చేపట్టినా, భవిష్యత్తులో ప్రయివేటు భాగస్వామ్యంతో స్వయం సమద్ధిగా సాగేలా చూడాలని తెలిపారు. జీహెహెచ్‌ఎంసీ, హెచ్‌ఏండీఏ సమన్వ యంతో నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు, ఆకర్షణీయమైన ల్యాండ్‌ స్కేపింగ్‌, స్కై వాక్‌లు సజనాత్మక ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని సూచించారు.

రాష్ట్రంలోని సోమశిల, వరంగల్‌, రామప్ప, యాదాద్రి, గోల్కొండ, తారామతి బరాదరి, నాగార్జునసాగర్‌ వంటి కీలక పర్యాటక ప్రాంతాల్లో అభివద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రధాన పర్యాటక కేంద్రాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
స్పెషల్‌ సీఎస్‌ వాణి ప్రసాద్‌ మాట్లాడుతూ మన రాష్ట్రంలో అద్బుతమైన పర్యాటక ప్రదేశాలు, వనరులు ఉన్నప్పటికీ, ప్రచారంలో వెనుకబడి ఉన్నామని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, కెరావెన్‌ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు ఆహ్వానించామనిచెప్పారు. పెండింగ్‌లో ఉన్న హరిత హోటళ్ల నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకోవాలనీ, వారసత్వ కట్టడాల నిర్వహణ కోసం ‘ఆగాఖాన్‌’ మోడల్‌లో ట్రస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అద్భుత కేంద్రాలుగా తీర్చి దిద్దేందుకు చైనా, వియత్నాం వంటి దేశాల్లో అధ్యయన పర్యటనలు చేపట్టాలని సూచించారు. జైపూర్‌ సిటీతో పోటీపడేలా హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాం తాలను ‘వెడ్డింగ్‌ డెస్టినేషన్లుగా తీర్చిదిద్దడం, కేరళ తరహాలో ప్రకతి ఉత్పత్తులు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించడం చేయా లని చెప్పారు. ఈత, తాటి కల్లు, ఇతర ఉప ఉత్పత్తులను ప్రోత్సహిస్తూనే బ్రాండింగ్‌ చేయడం, వారసత్వ విధానం ఉండాలన్నారు. విదేశీయుల కంటే భారతీయులే పర్యాటకానికి ఎక్కువ ఖర్చు చేస్తారనీ, కాబట్టి స్వదేశీ పర్యాటకంపై దృష్టిపెట్టి తెలంగాణ పర్యాటక ప్రమోషన్లు చేయాలని వివరించారు. ఈ సమా వేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమి, డైరెక్టర్‌ ఆఫ్‌ టూరింజం లక్ష్మణ్‌ రంజిత్‌నాయక్‌, కమిటీసభ్యులు పాపారావు, కమలవర్ధన్‌ రావు. డాక్టర్‌ బాలాజీ, జుల్ఫీ, మార్గ్‌పటేల్‌, రాందేవ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -