Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒకవైపు 'సుప్రీం'లో కేసు మరోవైపు జనగణనలో..

ఒకవైపు ‘సుప్రీం’లో కేసు మరోవైపు జనగణనలో..

- Advertisement -

ఎస్సీ హోదా లేని దళిత క్రైస్తవులు
13వ కాలంలో నిర్దేశం..

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
క్రైస్తవ మతం స్వీకరిస్తే దళితులకు ఎస్సీ హోదా రద్దేనని మార్చి 24వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాం శంగా మారింది. ఈ క్రమంలో.. దళితులు క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన కుల వివక్ష పోవడంలేదని, అందుకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతో రిజర్వేషన్లు ఇతర చట్టాలు కొనసాగించాలని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో వుంది. మరోవైపు జనగణన 2027 ఇండ్ల జాబితా, ఇండ్ల గణన షెడ్యూల్‌లో 13వ కాలమ్‌లో ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు అయితే అని పేర్కొన్న ఎస్సీ అయితే 1, ఎస్టీ అయితే 2 అని, ఇతరులు అయితే 3 అని పేర్కొనాలని స్పష్టంచేశారు. ఈ 13వ కాలమ్‌కు సంబంధించి ఇదే ప్రొఫార్మాలో దిగువన ‘గమనిక’ అని 13వ కాలమ్‌లో ‘షెడ్యూల్డు కులం అనేది హిందువులు, సిక్కులు, బౌద్ధుల నుంచి మాత్రమే ఉండవలెను. ఏదేని ఇతర మతం నుంచి ఉండకూడదు. షెడ్యూల్డు తెగ అనేది ఏ మతం నుంచి అయినా ఉండవచ్చును’ అని పేర్కొన్నారు. దీంతో దళిత క్రైస్తవులు జనగణన విషయంలో కులానికి సంబంధించిన విషయంలో ఎలా ముందుకుపోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జనాభా గణనలో ఇచ్చిన వివరాలతో దళిత క్రైస్తవులు ఆందోళనకు గురవుతున్నారు.

13వ కాలమ్‌ గమనిక తొలగించాలి : ఈర్ల కుమార్‌,దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
కేంద్ర ప్రభుత్వం వేసిన కెజి బాలక్రిష్ణన్‌ కమిషన్‌ అధ్యయనం చేయడం పూర్తికాకముందే.. జనగణనలో కులానికి సంబంధించి 13వ కాలానికి గమనికలో షెడ్యూల్డ్‌ కులం అనేది హిందువులు, సిక్కులు, బౌద్ధుల నుంచి మాత్రమే వుండవలెను. ఏదేని ఇతర మతం నుంచి ఉండకూడదు..’ అని పేర్కొనడం అభ్యంతరకరం. ఒకవైపు క్రైస్తవ సంఘాలు వేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వుంది. మరోవైపు జస్టిస్‌ బాలక్రిష్ణన్‌ కమిషన్‌ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించక మునుపే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యే. వెంటనే కేంద్రం 13వ కాలం గమనికను జనగణన ప్రొఫార్మా నుంచి తొలగించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -