Friday, May 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ఆర్‌ ఫోర్డ్‌ వెనక్కి

యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ఆర్‌ ఫోర్డ్‌ వెనక్కి

- Advertisement -

రికార్డు స్థాయిలో 300 రోజుల మోహరింపుప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక తిరిగి అమెరికాకు
వాషింగ్టన్‌ :యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ మధ్యప్రాచ్యం నుంచి వెనక్కి రానున్నది. 300 రోజులకుపైగా సాగిన రికార్డు స్థాయి మోహరింపు తర్వాత ఇది స్వదేశానికి బయలుదేరనుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను పట్టుకోవటానికి అమెరికా సైన్యం దీన్ని వినియోగించింది. అనంతరం ఇరాన్‌పై సంబం ధించిన యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించింది. అయితే ఆ యుద్ధనౌకపై క్షిపణులతో విరుచుకుపడటంతో దెబ్బతిన్న విషయం విదితమే. అమెరికా సైన్యం ఆత్మస్థైర్యాన్ని ఇరాన్‌ దెబ్బ కొట్టడంతో ట్రంప్‌ బృందం తట్టుకోలేకపోతోంది. మరోవైపు గెరాల్డ్‌ యుద్ధనౌకలో ఉన్న సిబ్బందికి కలిగిన అవస్థలు, వారిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా తిరిగి అమెరికాకు చేరుకోనున్నది. గత వారం యూఎస్‌ఎస్‌ జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ ఈ ప్రాంతానికి రాకతో, ఇరాన్‌ యుద్ధంలో బలహీనమైన కాల్పుల విరమణ సమయంలో మధ్యప్రాచ్యంలో మూడు అమెరికన్‌ విమాన వాహక నౌకలు మోహరించాయి. 2003 తర్వాత ఇంత సంఖ్యలో మోహరించడం ఇదే మొదటిసారి. టెహ్రాన్‌తో ఉద్రిక్తతలు పెరగడంతో యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ కూడా జనవరి నుంచి ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ యుద్ధనౌకపై కూడా ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడంతో అమెరికా సైన్యానికి దడపుట్టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -