Friday, May 1, 2026
E-PAPER
Homeజిల్లాలుసిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు

సిపిఐ(ఎం), సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: ప్రపంచవ్యాప్తంగా జరిగే 141 మే డే కార్యక్రమంలో భాగంగా నిజాంబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఎగురవేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల,మత ప్రాంత,జాతి,వివక్షత,విభేదాలు లేకుండా కష్టజీవులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడటానికి ప్రతిజ్ఞ దినంగా మేడను నిర్వహించుకుంటారని. ప్రధానంగా దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాశి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, ఫలితంగా కార్మికులు యాజమాన్యాలకు కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చి శ్రమదోపిడికి పూనుకున్నారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించకుండా రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేయకుండా, పెట్టుబడిదారులకు లాభాలు పరమావధిగా పని చేస్తున్నారని, మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో కష్టజీవులు అందరూ శ్రమకు తగ్గ ఫలితం కోసం, అంతరాలు లేని సమాజం కోసం సంఘటిత పోరాటాలకు పునరంకితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మత విద్వేషాలను ఎదిరించటం కొరకు ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్ ,సురేష్ నగర నాయకులు నల్వాల నరసయ్య,అనిత అనసూయమ్మ అంజయ్య, శంషాద్దీన్, ఇమామ్, తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్మికుల వ్యతిరేక లేబర్ కోడులను వ్యతిరేకించాలి. సిఐటియు పిలుపు…..
కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జెండాను వివిధ రంగాల కార్మికుల సమక్షంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఈవిఎల్ నారాయణ ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు కార్మికుల శ్రమను దోచుకోవటం కొరకు పాలకులను అడ్డం పెట్టుకొని కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అందులో భాగంగానే భారత దేశంలో కార్మిక చట్టాలను మార్చడం జరిగిందని. కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్మిక వర్గం అన్ని రంగాల కార్మికులను మిగతా వర్గాలను కలుపుకొని సంఘటిత పోరాటాలు నిర్వహించినప్పుడే విజయం సాధిస్తారని, మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు.ఎనిమిది గంటల పనిని మార్చటం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు జరపకుండా, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని మరింత పెంచి పోషిస్తున్నారని,కనీస వేతనాలు చట్టబద్ధ సౌకర్యాలు ఏవి వారికి వర్తించటం లేదని,వీటిపై సంఘటిత పోరాటాలకు సిద్ధపడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.స్వర్ణ జిల్లా నాయకురాలు వాణి,ఆశా వర్కర్ జిల్లా కార్యదర్శి సుకన్య ,మధ్యాహ్న భోజన సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, లిఫ్ట్ ఇరిగేషన్ జిల్లా కార్యదర్శి మైపాల్,మెడికల్ యూనియన్ నాయకులు సంపత్, బార్ధాన్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామ్ దండే, ఇమామ్ ,ఆటో యూనియన్ నాయకులు ఉద్ధవ్, తదితరులతో పాటు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం, పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు పాల్గొని మేడేను ఘనంగా నిర్వహించటం జరిగింది.

అదేవిధంగా అమ్మవారి చౌరస్తాలో సిపిఎం జెండాను నగర్ కమిటీ సభ్యులు అనిత, మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను యూనియన్ అధ్యక్షులు భూపతి వర్గం వద్ద సిఐటియు జెండాను సూర రవి, మార్కెట్ యార్డులో సిఐటియు జెండాను రాంధాండే, ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూనియన్ జెండాను ఎలక్ట్రిసిటీ నాయకులు నరేష్, ఇంద్రపూర్ వద్ద సిఐటియు జెండాను నల్వాల నరసయ్య, గోశాల వద్ద పార్టీ జెండాను నగర కార్యదర్శి సుజాత, అర్సపల్లిలో పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, బహుజన కాలనీలో సిర్ప లింగం, దొడ్డి కొమరయ్య కాలనీలో శ్రీదేవి, తదితరులు పార్టీ జెండాలను ఎగురవేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -