నవతెలంగాణ – ముధోల్
మండలంలోని గన్నోర గ్రామానికి చెందిన కమలబాయి(65) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్ఐ కధనం ప్రకారం…కమలబాయి తన మనవడితో కలిసి సోమవారం ద్విచక్ర వాహనంపై కుబీర్ మండలంలోని బెల్గాం గ్రామానికి వెళ్తున్న క్రమంలో విట్టోలి గ్రామం వద్ద అడవి పందులు అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కమల బాయికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందజేయడంతో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త భోజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



