Tuesday, May 5, 2026
E-PAPER
Homeసినిమాచిన్న సినిమాలను చంపేస్తున్న మాఫియా

చిన్న సినిమాలను చంపేస్తున్న మాఫియా

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో మాఫియా చిన్న సినిమాలను చంపేస్తోందని నటుడు, నిర్మాత షెరాజ్‌ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ తన సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. షెరాజ్‌ మెహదీ స్పందిస్తూ, ‘మంచి సినిమాలను కిల్‌ చేస్తున్నారు. చిన్న సినిమాలను నలుగురు రాక్షసులు చంపేస్తున్నారు. నైజాం ఏరియాలో ఒక్క థియేటర్‌ కూడా ఇవ్వలేదు. ఇది వ్యవస్థాత్మకంగా జరుగుతోంది. ఈ విషయంపై లీగల్‌గా పోరాటం ప్రారంభించాం. ఇండిస్టీ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇచ్చాం. చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండిస్టీలో ఉంది. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదు. అలాగే సెన్సార్‌ బోర్డు నిబంధనలు కూఆ చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయి. ఏడీసీసీ వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయి’ అని తెలిపారు. ప్రొడ్యూసర్‌, నటుడు లయన్‌ సాయి వెంకట్‌ మాట్లా డుతూ, ”ఇండిస్టీలో పెద్దల ధోరణి చిన్న సినిమాల పాలిట శాపంగా మారింది. చిన్న నిర్మాతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. త్వరలో నిరాహార దీక్షలు చేస్తాం. ఈ మాఫియాపై ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం. సినిమాల రిలీజ్‌ విషయంలో కాదు అవార్డుల విషయంలోనూ అన్యాయం జరుగుతోంది’ అని అన్నారు. నటి మధు, నటుడు, మేకర్‌ కాళీ చరణ్‌, నటుడు, నిర్మాత ఉప్పు రమేష్‌ చిన్న సినిమాలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -