Tuesday, May 5, 2026
E-PAPER
Homeసినిమాసర్‌ప్రైజ్‌ చేసే క్లైమాక్స్‌

సర్‌ప్రైజ్‌ చేసే క్లైమాక్స్‌

- Advertisement -

అమెరికన్‌ నటి జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్‌ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎం4ఎం’. ఈ సినిమా ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్‌. ఆదిత్య, డైరెక్టర్‌ వి.సముద్ర హాజరై, చిత్ర బందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరిం చుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం ప్రత్యేకంగా నిలిచింది. హీరోయిన్‌ జోశర్మ మాట్లాడుతూ,’ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు మోహన్‌ వడ్లపట్లకు కతజ్ఞతలు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రానికి ఇప్పటికే 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రేక్షకులు సినిమాను చూసి హిట్‌ చేస్తారనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘సినిమాలోని సీరియల్‌ కిల్లర్‌ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ ప్రకటించాం. ఇదొక యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. క్లైమాక్స్‌ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్‌ అనుభవాన్ని అందించబోతున్నాం’ అని దర్శక-నిర్మాత మోహన్‌ వడ్లపట్ల అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -