Wednesday, May 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం15న దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి

15న దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

ఎన్నికల హామీ అమలుకు మిలిటెంట్‌ పోరాటాలు
పెంచిన గ్యాస్‌ ధరలు
తక్షణమే తగ్గించాలి
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం ఈ నెల 15న తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు, జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మతోన్మాదులు, కార్పొరేట్‌ శక్తుల నుంచి పెరుగుతున్న జంట ప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులం పేరుతో జరుగుతున్న రాజకీయాలు దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాల్లో గెలవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ కార్మికులను సమీకరించి మిలిటెంట్‌ పోరాటాలు చేస్తామని ప్రకటించారు. ప్రజలకు అండగా ఉంటూ రాజ్యాంగం, చట్టాలన్నింటినీ అమలు చేస్తూ దేశంలోని మంచి పాలన అందించిన కేరళంలోని వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్ర హక్కులను హరించడం, నిరుద్యోగం పెంచేలా కుట్రలు చేసిందని విమర్శించారు. కార్పొరేట్లకు కొమ్ముకాసే కాంగ్రెస్‌ పార్టీ కేరళం ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. కేరళంలో వామపక్ష ప్రభుత్వం ఓడిపోవడం ప్రజలకు నష్టదాయకమన్నారు.

బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, తదితర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. ఎప్పటిలాగే ఎన్నికలు అయిపోగానే మోడీ సర్కారు గ్యాస్‌ రేట్లను పెంచిన విషయాన్ని ఎత్తిచూపారు. పెంచిన గ్యాస్‌, నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్‌చేశారు. వీబీ-జిఆర్‌ఏఎమ్‌జీ పథకం ద్వారా కొత్తకొత్త జీవోలను తీసుకొచ్చి కూలీలను ఉపాధికి దూరం చేసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం ఈ నెల 15న దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఆఫీస్‌ బేరర్లు బి.పద్మ, పొన్నం వెంకటేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, కొండమడుగు నర్సింహ, ములకలపల్లి రాములు, కందుకూరి జగన్‌, ఎం.ఆంజనేయులు, పెద్ది వెంకట్రాములు, ఎ.వీరయ్య, బి.సాంబశివ, లంక రాఘవులు, ఎం. నర్సింహులు, బి.సమ్మయ్య, సీహెచ్‌.రమేశ్‌, ఆర్‌.శశిధర్‌, శారద, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -