- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామం నుండి రాయికల్ పట్టణానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు పట్టుకున్నారు. టీజీ 21 టి 1537 నంబరు గల ట్రాక్టర్ను రాయికల్ శివారులో తనిఖీ చేసి రూ.5 వేల జరిమానా విధించినట్లు తహసిల్దార్ నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేపట్టిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాత్రమే ఇసుక రవాణా చేయాలని సూచించారు.
- Advertisement -



