Thursday, May 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్

విద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ రెండు ‘పీఎంశ్రీ’ (PM SHRI) పాఠశాలలను ఎంపిక చేసి, అక్కడ మే 12 నుండి జూన్ 3 వరకు ప్రత్యేక రెమిడియల్ కోచింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు. కోచింగ్‌కు హాజరయ్యే ప్రతి విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, ఇతర స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేయడంతో పాటు, వారికి ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్ కూడా అందించనున్నారు. అంతేకాకుండా, విద్యార్థులు తమ ఇళ్ల నుండి శిక్షణ కేంద్రాలకు చేరుకోవడానికి అయ్యే రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.1,100 చొప్పున ప్రభుత్వం నిధులను వెచ్చిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -