Thursday, May 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీటీడీ ఈవోను కలిసిన స్థానికులు 

టీటీడీ ఈవోను కలిసిన స్థానికులు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో (టీటీడీ ) ఈవో ముద్దాల రవిచంద్రఐఏఎస్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి లని, ఆలేరు పట్టణానికి చెందిన  చిరిగే శివకుమార్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి రంగనాయక స్వామి దేవాలయం అభివృద్ధి కోసం, (చాముండేశ్వర)శివాలయం అభివృద్ధి దాని పునరుద్ధరణ కోసం నిధులు కేటాయించాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల తిరుపతిలో  గురువారం ప్రత్యక్షంగా కలిశారు.

 టీటీడీ తరుపున సభ్యులు సానుకూలంగా స్పందించి చర్చించి కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు స్థానిక ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి సహిత రంగనాయక స్వామి దేవాలయ చైర్మన్ మోర్తల గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాషికంటి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మంగళగిరి  వరద రాజులు, సభ్యులు చిరిగే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -