- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసులు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 27 న జరగనున్న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పండుగను సామరస్యపూర్వకంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎస్‌హెచ్‌వో టి. యయాతి రాజు, ఎస్‌ఐ కె. అఖిల తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



