విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా 'పవర్‌పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమవుతుంది. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య హీరో ఎంట్రీ, సిగరెట్ తాగుతూ సింహం గురించి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడం అలరించింది. ఆ తర్వాత ఆ నేల స్వభావం, దానికి శక్తినిచ్చే మనుషుల గురించి చెబుతూ తన పాత్ర ఇంటెన్స్ చూపించారు. థియేటర్ స్క్రీన్‌పై బాణాసంచా విసిరే సీన్‌తో గ్లింప్స్ మరింత మాస్ ఫీల్‌ను అందించింది. సేనాపతి రవి అనే పాత్ర పేరును రివీల్ చేయడం ద్వారా ఆ క్యారెక్టర్‌లోని డామినేషన్, ఇంటెన్సిటీని సూచించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.
‘పవర్ పేటలో సేనాపతి రవిగా..
- Advertisement -
- Advertisement -



