Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌పై విమర్శలు అర్ధరహితం

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌పై విమర్శలు అర్ధరహితం

- Advertisement -

ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ ఔ
నవతెలంగాణ – వర్ధన్నపేట
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శలు చేయడం అర్థ రహితమని, విమర్శించే స్థాయి వారికి లేదని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో వర్ధన్నపేట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి పలువురు ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆకేరు వాగు శాశ్వత నిర్మాణ పనుల శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ కడియం కావ్య బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారన్నారు.

కడియం కుటుంబం గత రాజకీయ చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు. కడియంకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా చివరకు పార్టీని మోసం చేశారని ఆరోపించారు. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పాథాలజీ డాక్టర్‌గా పనిచేసిన సమయంలో సమయపాలన పాటించలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని తెచ్చింది మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాత్రమే అన్నారు.100 పడకల ప్రభుత్వాసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారన్నారు.

నియోజకవర్గం అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శిస్తే తాము ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షులు తూల్ల.కుమారస్వామి, మాజీ జెడ్పి్ పి టి మార్గం బిక్షపతి, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్ లు గుజ్జ వీరన్న , సిలువేరు కుమార స్వామి, తిరుపతి.సురేష్, సింగర బోయిన రమా రాజశేఖర్, తుమ్మల అరుణ శ్రీధర్, భానోతు జ్యోతి నవీన్, నాయకులు కొండేటి శ్రీనివాసు, పూజారి రఘు, తుమ్మల రవీందర్, మార్త సారంగపాణి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిలువేరు శ్రీధర్, జను రాములు, ఎండి రహీం, ఎల్లయ్య, పిట్లల రాజు, ఘోర, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -