Sunday, May 10, 2026
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీ ఏర్పాటు

కాంగ్రెస్ జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీ ఏర్పాటు

- Advertisement -

– ఉపాధ్యక్షులు గా అశ్వారావుపేట కళాకారుడు ముత్తూజా 
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రల రఘు ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు.  జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు చీకటి కార్తీక్, వైయస్ ఆర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షుడు కిన్నెర లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి జానకిరామ్, డాన్స్ మాస్టర్ డప్పు రాము కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కళాకారులు ముందుండాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

నూతన కమిటీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన కళాకారుడు ముత్తుజా ను జిల్లా సాంస్కృతిక సేన ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయనకు నియామక పత్రాన్ని తోట దేవి ప్రసన్న, చికాటి కార్తీక్, వైయస్ ఆర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -