- Advertisement -
మెగాస్టార్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్‌ప్రైజ్ చేశారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న చిరుని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ -2026 సదస్సుకి సీఎం ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదొక విశేషమైతే, చిరు నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తమ కుటుంబసభ్యులు, మనవళ్ళతో కలిసి వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని చిరుతో సీఎం షేర్ చేసుకోవడం మరో విశేషం.
- Advertisement -



