Tuesday, May 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగుప్త నిధుల కోసమే..

గుప్త నిధుల కోసమే..

- Advertisement -


సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక కట్టడాలు కూల్చివేత

‘హైడ్రా’తో పేదల 
బతుకులు కూల్చిండు
దేవుళ్ల మీద ఒట్టేసి ఇచ్చిన హామీలు విస్మరించాడు
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట రూ.500 కోట్ల కుంభకోణం
విచారణ చేపట్టాలి : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నర్సంపేట

గుప్త నిధుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి గుడులను కూల్చేస్తున్నాడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో కూల్చేసిన కాకతీయ కాలం నాటి శివాలయాన్ని బీఆరఎస్ నాయకులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అజ్మీర శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో బడులంటే పట్టింపు లేదు.. గుడులంటే లెక్కలేకుండా పోయిందని అన్నారు. బడులను బాగు చేయాలని కేసీఆర్ మన ఊరు.. మన బడి కార్యక్రమం చేపడితే.. రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా నిలిపివేశార ని ఆరోపించారు. నేడు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుకుంటూ పోతుందని తెలిపారు. ఎవరికైనా భగవంతుడంటే భక్తి, భయం ఉంటుందని, ఈ రెండు లేనోడు రేవంత్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి దేవుడి మీద ఒట్టేసి హామీలు ఇచ్చాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడని తెలిపారు. నాడు కేసీఆర్ గుడులను నిర్మిస్తే నేడు గుడులను కూల్చుతున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో సరస్వతీగుప్త నిధుల కోసమే..
మందిరం కూల్చడానికి అధికారులను పంపించాడని, అశోక్‌నగర్‌లో 800 ఏండ్ల క్రితం కాకతీయరుు నిర్మించిన దేవాలయాన్ని కూల్చాడని అన్నారు. ఇది తెలియక చేసిన చర్య కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందని తెలిపారు. దాదాపు 40 అడుగుల ఎత్తులో కలిగిన మట్టి కోటను కూల్చేసి అర్ధరాత్రి లోపల ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేశారన్నారు. గర్భగుడిలో గుప్త నిధుల కోసం 24 అడుగుల లోతులో గొయ్యి తవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని పురావస్తు శాఖ జిల్లా అధికారి గుర్తించి ఈ నెల 7న జిల్లా కలెక్టర్‌కు నివేదించారని తెలిపారు. అయినా ఈ కూల్చివేతపై కేసు నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. దీని వెనుక సీఎం, మరికొందరు పెద్దలు ఉన్నారనే కలెక్టర్ ఇప్పటికీ చర్యలు చేపట్టలేదన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల బతుకులను కూల్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సెక్రెటేరియట్‌లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నానని అన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడేమో గుడులను కూల్చేసి లంకె బిందెల కోసం వేట మొదలెట్టాడని తెలిపారు. రాష్టంలో 72 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్ పిలిచి 4నుంచి 5శాతం ఎక్సెస్ వేసిన కాంట్రాక్టర్లకు అప్పగించడంలో మతలబు దాగి ఉందన్నారు. ఎక్సెస్ టెండర్‌లతో రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తక్షణమే గుడిలో గుప్త నిధుల తవ్వకాలపై విచారణ చేపట్టాలని, కూల్చివేసిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లపై విచారణ చేపట్టి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -