నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి జరుగుతుందని, కళాశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించడం ఇంటర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ విద్య వారోత్సవాలు భాగంగా డిజిటల్ క్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగ, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ రామ్ పటేల్, ధనుర్ గ్రామ సర్పంచ్ జయశ్రీ, దేవిదాస్ పటేల్, కళాశాల లెక్చరర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జూ.కళాశాలలో డిజిటల్ క్లాసులను ప్రారంభించిన ధరాస్ సాయిలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



