నవతెలంగాణ-ఆలేరు టౌన్
రోగులకు నర్సుల సేవలు ప్రశంసనీయమని, ఆలేరు ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్, డాక్టర్ స్వప్న రాథోడ్ అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న రాథోడ్ మాట్లాడుతూ రోగులను సిస్టర్స్ ఆసుపత్రికి వచ్చినప్పటినుండి డిశ్చార్జి అయ్యేవరకు ప్రతిక్షణం పేషెంట్ తో ఉంటూ డిశ్చార్జ్ అయ్యేవరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సేవలందిస్తున్నారని కొనియాడారు.
మానసిక ధైర్యాన్నిస్తూ కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు. ఓపికతో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ఇల్లు పిల్లలు వదిలి వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. ఆలేరు పిహెచ్సిలో స్టాఫ్ తక్కువ ఉన్నప్పటికీ ,ఉన్న స్టాఫ్ పేషంట్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమర్థంగా సేవలందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది ,ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



