టీవీకే సర్కార్‌కు అనుకూలంగా 144 ఓట్లు
విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన 22 మంది సభ్యులు
వాకౌట్ చేసిన డీఎంకే- మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఐ(ఎం) సీపీఐ,వీసీకే
చెన్నై: తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కింది. విజయ్‌కు అనుకూలంగా 144 ఓట్లు, వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. పీఎంకే, బీజేపీకి చెందిన మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా నిలిచారు. విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. మే 13వ తేదీలోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ‘ఫ్లోర్ టెస్ట్’ నిర్వహించారు. విశ్వాస పరీక్షపై తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమిళనాడు అసెంబ్లీ చర్చ సందర్భంగా తొలుత మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు తాము విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న తొలి మూడు నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వామపక్షాలు విజయ్‌కు మద్దతు ప్రకటించాయి.
సీఎం విజయ్ ప్రమాణస్వీకారానికి ముందు గవర్నర్ ఆర్లేకర్ పలుమార్లు తిరస్కరించిన తీరుపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడులో గవర్నర్ రూల్‌ను అడ్డుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు హక్కులను కాలరాస్తోందని సీపీఐ ఆరోపించింది. విజయ్ ఐదేండ్ల పాటు కొనసాగాలని వీసీకే అశాభావం వ్యక్తం చేసింది. అయితే ఓఎస్డీగా వ్యక్తిగత జ్యోతిష్యుడిని విజయ్ నియమించడంపై అభ్యతరం వ్యక్తం చేసింది. విజ్ఞానశాస్త్రానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు సైతం విజయ్‌కు మద్దతు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న డీఎండీకే సైతం విజయ్‌కు మద్దతు తెలిపింది.
డఎంకే వాకౌట్
డీఎంకేతో పాటు అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకించాయి. బలపరీక్షకు ముందుగానే విజయ్, తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీఎంకే నేత ఉధయనిధి స్టాలిన్ ఆరోపించారు. 65 శాతం తమిళనాడు ఓటర్లు విజయ్‌కి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. తమ కూటమి పక్షాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులో రీల్ ప్రభుత్వం కాకుండా రియల్ ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్‌కు దూరంగా ఉంటామని చెబుతూ 59 ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది.
అయితే బీజేపీ మాత్రం ఈ ఓటింగ్‌లో ‘తటస్థంగా’ ఉండాలని నిర్ణయించింది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం విజయ్‌కు ఓటు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ముందే చెప్పింది. విజయ్ ప్రభుత్వం తమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి ఆకర్షించే ప్రయత్న చేసిందని ఆరోపించారు. మరోవైపు అన్నాడీంకే షణ్ముగం వర్గం పళనిస్వామి వ్యాఖ్యలను ఖండించింది. 25 మంది షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.
మద్దతిచ్చిన వారికి విజయ్ కృతజ్ఞతలు
చర్చ అనంతరం టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి ఐదేండ్ల కాలం పాలిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఓటు వేయనివారిది కూడా అని విజయ్ పేర్కొన్నారు.టీవీకే ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో ఊరట ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనకూడదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తమిళనాడు అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పించింది.
బలపరీక్షలో నెగ్గిన విజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



