Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి...

ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి…

- Advertisement -

 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బడిబాట కార్యక్రమం విద్యార్థుల తో కలిసి ఉపాద్యాయులు గ్రామంలో ర్యాలీ తీసి గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ బుక్స్ అందించి నాణ్యమైన మధ్యాన్న భోజనం అందించి అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందించే అనుభవజ్ఞులై ఉపాద్యాయులు ఉంటారని, కావున ప్రతి ఒక్క తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

విద్యార్థులందరు మంచిగా చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలని కోరారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రచ్చ మల్లికార్జున్ మాట్లాడుతూ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి  తమ సొంత నిధులతో పదవ తరగతిలో 500 పైన మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అద్భుతమైన జ్ఞాపికను అందించి, నగదు బహుమతులను అందజేశారని, ప్రతి స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం వేడుకలో వారి సొంత నిధులతో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నారని వారికి మా పాఠశాల యాజమాన్యం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

ప్రభుత్వం కలిపిస్తున్న డిజిటల్ విద్యని, ఉన్నతమైన విద్యని తల్లి తండ్రులు అందరూ గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలని చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని సర్పంచ్ గారు ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిన్నం శ్రీశైలం,మాజీ ఎంపిటిసి ఉడుత శారద ఆంజనేయులు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, ఏ ఎం సి   చైర్మన్ కవిత, ఉపాద్యాయులు ఎస్  యాదగిరి, ఏ  రమేష్, ఏస్  రత్నజ, ఎం వెంకటేశ్వర్లు, కె  విజయ్ కుమార్, సి హెచ్  సుప్రజ, డి  రమేష్, కె  ఉపేందర్, ఫాతిమా, బాలాజీ, చూడమాని, ఇంద్రిక, వార్డు సభ్యులు గ్రామస్థులు విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -