- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని కొడచర ప్రాథమికోన్నత పాఠశాల లో వందమంది విద్యార్థులకు ఆ గ్రామ సర్పంచ్ బొజ్జేడ్కర్ తేజశ్రీ మాధవరావు స్వచ్ఛందంగా చేయూతగా పాఠశాలలో చదువుకునే మొత్తం 100 మందికి షూస్ సాక్స్ టై బెల్ట్ బ్యాడ్జిలను డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసిన వస్తువులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున గ్రామ సర్పంచ్ తేజశ్రీ మాధవరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



