- Advertisement -
నవతెలంగాణ – భీంగల్: టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోదెల స్వామి ఆధ్వర్యంలో శనివారం నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి లింబాద్రిగుట్ట వద్ద అన్నసత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భోదిరే స్వామి, టౌన్ అధ్యక్షులు జె జె నర్సయ్య,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, కన్నె సురేందర్, కుంట రమేష్, అనంతరావు, రాజు, జనార్ధన్, సురేష్, గోపాల్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -