Friday, May 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు..రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు:ఎంపీడీవో

ధాన్యం కొనుగోలు..రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు:ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ-తొగుట: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఎంపీడీవో జీ. నాగేశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావు పేట ఐజెపి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరిస్తున్న విధానంలో సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు కల్లాల వద్ద ధాన్యం అర బెట్టుకొని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకురావా లని సూచించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసు కోవాలని ఐకెపి సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తూర్పాలబట్టే మిషడ్లు, లారీల కొరత, తాగునీటి వసతి అన్ని సౌకర్యాలు సవ్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, ఐకెపి సిఏలు బండ కాడి సుధా, జంగ పల్లి బుజ్జి, ఐకెపి సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -