నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నర్సాపూర్ గ్రామంలో శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన ఊరు – మన భద్రత, మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ జి.మధుకర్ గ్రామ ప్రజలకు సీసీటీవీ కెమెరాలు గ్రామ భద్రతకు ఎంత ముఖ్యమో వివరించారు. సీసీటీవీ వ్యవస్థలు 24 గంటల పాటు నిఘా నిర్వహిస్తూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడంలో, నేరాల గుర్తింపులో పోలీసులకు సమర్థవంతమైన పర్యవేక్షణలో సహకరిస్తాయని తెలిపారు.గ్రామ ప్రజలు తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించి కమ్యూనిటీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
నర్సాపూర్ లో సీసీటీవీ కెమెరాలపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



