Saturday, June 6, 2026
E-PAPER
Homeసినిమాకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్ర

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్ర

- Advertisement -

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఈనెల 22న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు వీరు వులవల మీడియాతో మాట్లాడుతూ, ‘‘కొత్త బంగారు లోకం’ టైటిల్‌ను రాసి, డిజైన్ చేశాను. అలా నేను ఇప్పటికీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది హీరోలకు కలిపి 350కి పైగా టైటిల్స్‌ని రాసి, డిజైన్ చేశాను. ఈ కథను పట్టుకుని తిరుగుతున్న టైంలో ‘మసూద’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసే అవకాశం వచ్చింది. అది కూడా మంచి విజయం సాధించింది. అప్పుడు నిర్మాత కోటేశ్వరరావుకి కథ చెప్పారు. ఇలాంటి సినిమా అయితేనే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మా అబ్బాయి రీచ్ అవుతాడని ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రేమ కోసం ఏమైనా చేసే ఓ మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సప్తగిరి, కసిరెడ్డి పాత్రలు అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -