Sunday, May 17, 2026
E-PAPER
HomeNewsమరోసారి పెరిగిన సీ ఎన్ జీ ధరలు

మరోసారి పెరిగిన సీ ఎన్ జీ ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. తాజా సవరణ ప్రకారం కిలోకు రూ.1 పెంపు చేశారు. ఈ నిర్ణయంతో వారం రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం (మే 15న) కిలో సీఎన్జీ పై రూ.2 పెంపు జరిగింది. దీంతో 48 గంటల్లోనే కిలోకు మొత్తం రూ. 3 పెంచడంతో సీఎన్‌జీ ఉపయోగించే వాహనదారులపై ప్రభావం పడనుంది. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.80.09గా ఉండగా, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో రూ.88.70కి చేరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -