Wednesday, May 20, 2026
E-PAPER
Homeసినిమావినూత్నంగా ప్రమోషన్లు

వినూత్నంగా ప్రమోషన్లు

- Advertisement -

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టు కుంటుంది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రణవ స్వరూప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా ఉన్నాయి. ప్రజల వద్దకే ప్రమోషన్స్ అంటూ నందు చేస్తున్న హంగామా ఎంతగానో ఆకట్టుకుం టోంది. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంది. బ్లింకిట్ డెలివరీ బాయ్ గెటప్ లో నందు చేసిన ప్రమోషన్ బాగా వైరల్ అయ్యింది. అలాగే మార్కెట్లో కూరగాయలు అమ్మే వ్యక్తిగా కూడా నందు హల్ చల్ చేశాడు. మొత్తానికి నందు ప్రమోషన్స్ ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లాయి. ఈ భిన్న ప్రమోషన్స్ ఈ సినిమా విడుదల అయ్యాక మంచి రెస్పాన్స్ తీసుకొస్తాయని, అలాగే ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పిస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -