ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ. గురురాజ్, పొలిటికల్ లీడర్ గ్యాదరి బాలమల్లు, కెనడా వాసి తరుణ్ సాహి, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, బీసీ సంఘం నేత అంజలి, విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి, హీరో కిరణ్, హీరోయిన్ అక్స ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, నటి తులసి తదితరులు పాల్గొన్నారు. చిత్ర సమర్పకులు డీఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశాన్ని అందిస్తుంది. మన వీర జవాన్ల సాహసాలపై రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందిఅని అన్నారు. దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'ప్రతి మనిషిలో దీక్ష, పట్టుదల ఉంటాయి. వాటితో పనిచేస్తే ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది. వీర జవాన్ మురళీనాయక్ గొప్పతనాన్ని తెలియజేసేలా ఒక స్పెషల్ సాంగ్ రూపొందించాం. జూన్ 12న విడుదల కానున్న ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలి అని చెప్పారు. హీరో కిరణ్ మాట్లాడుతూ,’డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. దీక్ష, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది` అని అన్నారు. కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దర్శక, నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, సమర్పకులు : డీఎస్ రెడ్డి, సంగీతం : రాజ్ కిరణ్, ఎడిటర్ : మేఘన శ్రీను, ఫైట్స్ : రవి, డాన్స్ : ఆనంద్. ‘డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. వీర జవాన్ సాహసాన్ని చెప్పే పాటను థ్రిల్లింగ్‌గా రూపొందించారు. ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉంది. కిరణ్, అక్సా ఇద్దరూ చాలా బాగా నటించారు`.- సుమన్
దీక్ష, పట్టుదలతో చేస్తేఏదైనా సాధ్యమే అని చాటేలా..
- Advertisement -
- Advertisement -



