‘పురుష:సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఈనెల 22న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో హీరో బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'మా దర్శకుడు వీరు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ జర్నీలో ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సతీష్ మా అందరినీ ఎంతో అద్భుతంగా చూపించారు. శ్రవణ్ మాకు మంచి పాటల్ని ఇచ్చారు. రవి మాకు మంచి సెట్స్ వేసిచ్చారు. సప్తగిరి, కసిరెడ్డి సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారే నా సిగ్గు, భయాన్ని, బిడియాన్ని పోగొట్టారు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేష్ తో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. రాయంచ, హాసిన, విషిక నాకెంతో సపోర్ట్ చేశారు. మా కోసం వచ్చిన తేజుకి, ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా నాన్నకి థాంక్స్. ఈ సమ్మర్లో అందరూ కూల్గా, ఫుల్‌గా ఎంటర్టైన్ అవుతారు అని కచ్చితంగా చెప్పగలను’ అని అన్నారు. దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ,‘సరస్వతి బత్తుల వల్లే ‘పురుష:’ ఇక్కడి వరకు వచ్చింది. ఈ జర్నీలోని ప్రతీ దశలో ఆమె మాకు సపోర్ట్‌గా నిలిచారు. కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక కోటేశ్వరరావు ఓకే చెప్పారు. ఖర్చుకి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా కూడా కొత్త హీరోలా అనిపించడు అని తెలిపారు. ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందిఅని నిర్మాత బత్తుల కోటేశ్వరరావు చెప్పారు. నిర్మాత సరస్వతి బత్తుల మాట్లాడుతూ, ‘ఈ సమ్మర్లో అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తూ మా మూవీని ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది. మా తమ్ముడిని హీరోగా తెర మీద చూడాలని ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.
కుటుంబం అంతా ఎంజాయ్ చేసే చిత్రం
- Advertisement -
- Advertisement -



