కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిం చారు. ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. మాది గుంటూరు జిల్లాలోని కారం పూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు వీరుని సతీష్ ముత్యాల పరిచయం చేశారు. కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. మా కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌నే సినిమా ఆఫీస్‌గా మార్చాం.
ఈ కథ చాలా బాగుంటుంది. వీరు నెరేషన్ ఇచ్చిన తీరు కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది.
వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ వల్లే కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి, కసిరెడ్డి చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపిం చడమే కాకుండా చక్కగా నటిం చారు. అనంత శ్రీరామ్ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసి ఆడియెన్స్ చెప్పాలి. మాకు శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా కోసం కీరవాణి కూడా ఓ పాట పాడారు. అది మా అదృష్టం. ఇప్పటికే మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది.
300 థియేటర్లలో రిలీజ్
- Advertisement -
- Advertisement -


