సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ‘రమణి కళ్యాణం`. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు. ఈనెల 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ,’ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మేము చాలా మంచి ప్రయత్నం చేశాం` అని తెలిపారు.’ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్` అని హీరోయిన్ దీప్షిక చంద్రన్ చెప్పారు. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ,’ఇది చాలా మంచి కథ. మంచి ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ప్రేక్షకుల మనసును హత్తుకుంటుంది` అని తెలిపారు.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,’దర్శకుడు కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సినిమాలో మనసుకు తగిలే డైలాగ్స్ ఉన్నాయి. రైటింగ్ చాలా బాగుంది` అని అన్నారు.’దర్శకుడు విజయ్ తన తొలి సినిమాకే చాలా అరుదైన కథను ఎంచు కున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాలని ఆశీర్వదిస్తున్నాను. విజయ్‌కు సపోర్ట్ చేసిన ఆయన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. 22న ప్రేక్షకులు కూడా ఆయన ప్రయత్నానికి తగిన ఫలితం ఇస్తారని నమ్ముతున్నాను` అని అలీ చెప్పారు.



