Wednesday, May 20, 2026
E-PAPER
Homeసినిమా‘అందీ అంద‌ని అందం..’

‘అందీ అంద‌ని అందం..’

- Advertisement -

డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కోవడానికి సిద్ధమయ్యారు. రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మిస్తున్నారు. మేక‌ర్స్ ఈ సినిమా నుంచి బుధ‌వారం ‘అందీ అంద‌ని అందం’ అనే పాట‌ను విడుద‌ల చేశారు. విరాజ్ అశ్విన్‌, రెజీనా క‌సాండ్రా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తోంది.
ఈ మధురమైన పాటను కార్తీక్‌, శ్వేతా మోహ‌న్ ఆలపిం చారు. గేయ రచయిత ల‌క్ష్మీ భూపాల‌ ఈ పాటకు అర్థవంతమైన, హృదయాన్ని తాకేలా చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు. ఇళ‌య‌రాజా మరోసారి తన అద్భుతమైన సంగీత ప్రతిభను చూపించారు. ఈ పాటలో ముగ్గురు ప్రధాన పాత్రల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, భావోద్వేగ క్షణాలను ఎంతో అందంగా చూపించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -