Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలోనే పాలీసెట్ కౌన్సిలింగ్ సేవలు

కాటారంలోనే పాలీసెట్ కౌన్సిలింగ్ సేవలు

- Advertisement -

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాట
నవతెలంగాణ – కాటారం

విద్యార్థుల సౌకర్యార్థం కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పాలీసెట్ పరీక్ష రాసి పాలిటెక్నిక్ సీటు పొందే విద్యార్థులు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాటారంలోనే ధృవపత్రాల పరిశీలన, కౌన్సిలింగ్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల నమోదు వంటి సేవలను పొందవచ్చన్నారు.

ఇప్పటి వరకు విద్యార్థులు వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాలకు వెళ్లి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి వచ్చేదని, దీనివల్ల సమయం మరియు వ్యయభారం పెరుగుతుండేదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.

పాలీసెట్ తొలి విడత కౌన్సిలింగ్‌లో భాగంగా ధృవపత్రాల పరిశీలన ఈ నెల 29-05-2026 నుండి 01-06-2026 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమయానికి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -