Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా డా.మడికొండ శ్రీను

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా డా.మడికొండ శ్రీను

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పరకాల నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మడికొండ శ్రీను నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే తన నియామకానికి సహకరించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, టీపీసీసీ నాయకులు ఒడితల ప్రణవ్ కుమార్‌లకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, దళిత సమాజ శ్రేయస్సుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని డాక్టర్ మడికొండ శ్రీను ఈ సందర్భంగా పేర్కొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -