Saturday, May 23, 2026
E-PAPER
Homeఖమ్మంసర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి

సర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి

- Advertisement -

– బీఎల్ఏ లను సూచించండి
– తహశీల్దార్ దాసరి కిషోర్
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని తహశీల్దార్ దాసరి కిషోర్ కోరారు.  శనివారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఎల్వోలు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 47,494 మంది ఓటర్లు ఉండగా,ఇప్పటివరకు 41,692 ఓటర్ల డాటా మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఇంకా 5,802 ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. 17,577 అనామలీస్ గుర్తించినట్లు వెల్లడించారు. 118-అశ్వారావుపేట నియోజకవర్గం 91.74 శాతం డాటా మ్యాపింగ్‌తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

జూన్ 26 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తారని తెలిపారు. ప్రతి ఓటరు ఇంటిని కనీసం ఒక్కసారి, అవసరమైతే మూడు సార్లు వరకు సందర్శిస్తారని చెప్పారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.

కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, సవరణలకు ఫారం-8, మరణించిన లేదా శాశ్వతంగా గ్రామం విడిచివెళ్లిన వారి పేర్ల తొలగింపుకు ఫారం-7 వినియోగించనున్నట్లు తెలిపారు. ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్చికమని స్పష్టం చేశారు. సమావేశంలో నియోజకవర్గ ఎలక్షన్ డీటీ సయ్యద్ హుస్సేన్, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మయ్య,బీఎల్వో లు, సూపర్ వైజెర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -