Saturday, May 23, 2026
E-PAPER
Homeఖమ్మంవరి రకాల సాగు వైపు రైతులు అడుగులు వేయాలి

వరి రకాల సాగు వైపు రైతులు అడుగులు వేయాలి

- Advertisement -

– వానాకాలం 2026 కు ముందస్తు ప్రణాళికపై ఏడీఏ పెంటేల రవికుమార్ సూచన
నవతెలంగాణ – అశ్వారావుపేట

రాబోయే వానాకాలం – 2026 సీజన్‌లో మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిరుచి, మిల్లింగ్ సామర్థ్యం, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు డిమాండ్ ఉన్న వరి రకాల సాగుపై దృష్టి సారించాలని ఏడీఏ పెంటేల రవికుమార్ సూచించారు. ముఖ్యంగా తక్కువ నూక అయ్యే లక్షణం (హై హెడ్ రైస్ రికవరీ) కలిగిన వరి రకాలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ తెలిపారు.

వినియోగదారుల కోసం కుకింగ్ క్వాలిటీ, మిల్లర్ల కోసం మిల్లింగ్ క్వాలిటీ, ఎగుమతి అవసరాలకు అనుగుణంగా సన్న మరియు దొడ్డు రకాల వరి ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ప్రోత్సహించాల్సిన సన్న రకాలు :

బీపీటీ–5204

తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్–15048)

కెఎన్‌ఎం–1638

జైశ్రీరామ్

హెచ్‌ఎంసీ / హెచ్‌ఎం టీ

డబ్ల్యూజీఎల్–962

డబ్ల్యూజీఎల్–44

జీజీఎల్–1798

సాగు నిరుత్సాహపరచాల్సిన సన్న రకాలు :

గంగా కావేరి

ఎంటీయూ–1224

ప్రోత్సహించాల్సిన దొడ్డు రకాలు :

ఐఆర్–64

ఎంటీయూ–1010

కెఎన్‌ఎం–118

సాగు నిరుత్సాహపరచాల్సిన దొడ్డు రకాలు :

ఎంటీయూ–1001

జీజీఎల్–24423

ఎంటీయూ–1153

ఎంటీయూ–1156

అలాగే వానాకాలం ప్రారంభానికి ముందే ఈ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విత్తన తయారీదారులు, డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమన్వయంతో పనిచేసి నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మార్కెట్‌లో డిమాండ్ లేని రకాల స్థానంలో డిమాండ్ ఉన్న రకాలను సాగు చేసేలా చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు.

వానాకాలం – 2025 వరి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో):

అన్నపురెడ్డిపల్లి – 7,900

అశ్వారావుపేట – 7,846

చంద్రుగొండ – 4,402

దమ్మపేట – 9,712

ములకలపల్లి – 10,346

మొత్తం సాగు విస్తీర్ణం : 40,206 ఎకరాలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -