రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు
నవతెలంగాణ-మిడ్జిల్
ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్య రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా నాయకులు రాజేశ్వర్, పల్లె తిరుపతి, మండల అధ్యక్షులు నరేష్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని మున్ననూర్, రాణి పేట గ్రామాలలో వడ్లు కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా విఫలమైందని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. తూకాల్లో మోసాలు కొనుగోలు కేంద్రాలలో అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 కిలోల బస్తాకు 42 కిలోల వరకు తూకం వేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని అని ఆవేదన వ్యక్తం చేశారు.
చెల్లింపుల్లో జాప్యం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ, రైతులకు సకాలంలో డబ్బులు జమకావడం లేదని వారు ఆరోపించారు. నేను రోజుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే నిద్రిస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, అధికారులు స్పందించి సకాలంలో వరి కొనుగోలను చేసి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున రైతులతోపాటు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, ఆంజనేయులు వినోద్, రాజు, రాహుల్ నాయక్, ఆనంద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.



