Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా రాంబాబు

ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా రాంబాబు

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్
మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా కట్టంగూరు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గుండు రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన ఉపసర్పంచుల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పరడ ఉపసర్పంచ్ కాసర్ల ఝాన్సీ రెడ్డి, మునుకుంట్ల ఉపసర్పంచ్ కడారి మల్లేశం,దుగినెల్లి ఉప సర్పంచ్ వనం శ్రీలత, ప్రధాన కార్యదర్శిగా పందెనపల్లి ఉపసర్పంచ్ గద్దపాటి వీరేందర్, సహాయ కార్యదర్శులుగా ఇస్మాయిల్ పళ్లి ఉపసర్పంచ్ అలుగుబెల్లి శేఖర్ రెడ్డి, నారగూడెం ఉప సర్పంచ్ దుప్పెల్లి శంకరయ్య, పిట్టంపల్లి ఉపసర్పంచ్ పల్నాటి పద్మ, కోశాధికారిగా కురుమర్తి ఉపసర్పంచ్ నూకల రాములు, కార్యవర్గ సభ్యులుగా నల్లగుంటబోలు ఉప సర్పంచ్ ఎడ్ల లింగయ్య, భాస్కర్లబాయి ఉపసర్పంచ్ గాదపాక సంధ్య, గౌరవ సలహాదారులుగా కలిమెర ఉపసర్పంచ్ ఖమ్మంపాటి లింగమ్మ, రామచంద్రపురం ఉపసర్పంచ్ నీలం సాయిలు, గార్లబాయి గూడెం ఉపసర్పంచ్ శిరీషాల సాయి ప్రతాప్ లను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -