Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

- Advertisement -

పంటల సాగులో శాస్త్రవేత్తలు సూచనలు పాటించాలి ఎంపీ, ఎమ్మెల్యే
నవతెలంగాణ-అచ్చంపేట
వ్యవసాయం సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, వివిధ రకాల పంటల సాగులో శాస్త్రవేత్తల సూచనలు రైతులు పాటించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ల ఆధ్వర్యంలో పదర మండలం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ముగింపు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా  పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు మాట్లాడారు.

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిజిస్టార్  డా సి.హెచ్. విద్యా సాగర్ మరియు డీన్ డాక్టర్ సి. హెచ్. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. వరి మొక్కజొన్న, పత్తి లాంటి పంటలే కాకుండా కూరగాయ పంటలు, లాభసాటి పంటలు అపరాలు, చిరుధాన్యాలను పండించాలన్నారు. కోరారు. రైతుల అవగాహన కొరకు శాస్త్రవేత్తలు మరిన్ని శిక్షణ కార్యక్రమాలను అందించాలని శాస్త్రవేత్తలను కోరారు. విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ గ వ్యవసాయ విద్యలో విద్యార్థులకు కల్పించిన అవకాశాలు  సదుపాయాలను వివరిస్తూ రైతు కుటుంబం లోని విద్యార్థులను దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. తదుపరి డాక్టర్ సి హెచ్ వేణుగోపాల్ రెడ్డి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను  ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తంలో 1600 గ్రామాలలో 2.5 లక్షల రైతులతో  అవగాహన అంశాలను తెలియజేశామన్నారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం నుండి ఎ డి ఆర్ డాక్టర్  ఎల్.కృష్ణ  మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి  రకాలను గురించి రైతులకు వివరించారు. వ్యవసాయంలో యూరియా వాడకాన్ని తగ్గించాలని, పశువుల ఎరువులు, జీవన ఎరువుల ద్వారా కొంత మేరకు ఎరువులను ఆదా చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు ఆలోచించాలని గ్రామానికి కావలసిన ఆహార పదార్థాలు గ్రామాల్లోనే పండించే విధంగా, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి డ్రిప్పు మరియు స్ప్రింక్లర్ల వాడకాన్ని పెంచాలని రైతులను కోరారు. సకాలంలో పంటలను విత్తడం ద్వారా పంట చివర్లో నీటి సరఫరా కొరకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండాలని సూచించారు.

అనంతరం ప్రధాన  శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శ్రీధర్ మాట్లాడుతూ, పంట మార్పిడి ద్వారా ప్రధానంగా నూనె గింజల సాగు ద్వారా సుస్థిర ఆదాయం సంపాదించడం  గురించి వివరించారు. పంట మార్పిడి లో భాగంగా ఆముదం పంట విస్తీర్ణాన్ని పెంచవలసిందిగా కోరారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు మరియు సరైన పద్ధతుల్లో రసాయనాల వినియోగం పై అవగాహన కల్పించారు. అనంతరం రైతులు మరియు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో శాస్త్రవేత్తలను రైతులు తమకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈశ్వర్ రెడ్డి, స్రవంతి, షైలా, జిల్లా వ్యవసాయ మరియు అనుబంధిత శాఖల  అధికారులు, పదర మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -